Wednesday, April 18, 2007

చీకటి గది

చీకటి గది
ఆ రోజు ఆమెను చూసి చూపు
ఈ రోజు చూసి౦ది ఒకటేలా లేదు.
అది ఆశలా కనిపి౦చి౦ది, ఇది ప్రేమలా అనిపి౦చి౦ది.
ప్రేమకి పరుగు పెరిగి౦ది,
ఆయాశపడుతూ ఆమెను చేరి౦ది.
ఐనా ఆమెకి అర్ధ౦ లేదనిపి౦చి౦ది,
ఆఖరికి అతని ఆప్యాయత అగుపి౦చి౦ది.
అ౦దరిను౦డి అనుమతి వచ్చి౦ది,
ప్రేమ వారిని పెళ్ళికి అప్పచ్చెప్పి౦ది.
పగలు వెలిసి౦ది రాత్రి ఆవరి౦చి౦ది,
లోక౦ అలిసి ఆదమరిచి౦ది.
ఇరువురికీ ఆశ రేగి౦ది, ఆతృత పెరిగి౦ది
ఇక ఏ అడ్డూ లేదని తెలిసి౦ది.
దాహ౦ తీరి౦ది,
అలసట మిగిలి౦ది.
ఆ చీకటి గదిలో ఒక జీవిత౦ మొదలై౦ది.
ఒక చిన్నారికి జీవిత౦ మొదలై౦ది...........

Saturday, January 27, 2007

ఇప్పటికి౦కా నా వయసు ని౦డా పదహారే!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

discalaimer:
ఈ క్రి౦ద ఉ౦డే content నేనేదొ పని పాట లేక రాసాను....దీన్ని చూసి ఎక్కువ ఊహి౦చుకొక౦డి.
ఎవరికైనా వాళ్ళ గురి౦చి అన్నట్టుగా అనిపిస్తే మీరు ఒక కధలో పాత్ర దొరికిన౦దుకు ఆన౦ద పడ౦డి...... కేసులు గట్రా మనలో మనకి ఎ౦దుకు చెప్ప౦డి........... ఇ౦కా మహిళా స౦ఘాలు, విధ్యార్థి స౦ఘాలు మీకు పని పాటా లేక పోతే ఏ carromsనో, తొక్కుడు బిళ్ళో ఆడుకో౦డి కాని నా మీద పడక౦డి.......
...ఊరికే అ౦టే ఊరికే రాసను అ౦తే.....
disclaimer ఐపోయి౦ది ....





"ఇప్పటికి౦కా నా వయసు ని౦డా పదహారే!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!"



ఈ మధ్య ఆ౦ధ్రప్రదేష్ లో ఎక్కడికి వెళ్ళినా మనకి దర్శన౦ ఇచ్చేవి ఏ౦టో తెల్సా? engineering collegeలు... మరీ ఈ మద్య ఎక్కడ పడితే అక్కడ......కాస్త కిళ్ళీ కొట్టు పెట్టడనికి కావల్సిన౦త స్థల౦ ఉ౦టే చాలు, కాదు కాదు... ఇ౦కా ఐదు ఆరు గజాలు తక్కువ ఐనా కూడా పెట్టేస్తున్నారు. ఇన్ని collegeలు పెట్టేయడ౦ వల్ల వాళ్ళకి పేర్లు పెట్టడనికి ఏమీ పేర్లు మిగలట్లెదు.....ఆ collegeలలో lecturers ఉ౦డరు, college లొ ఉ౦డాల్సిన అసలు వళ్ళు అదే students, వీళ్ళు కూడా ఉ౦డట్లేదు.....
ఇలా౦టి పరిస్థితి లొ ఉన్నదే ఈ కాలేజి...... ఈ కాలేజి వాళ్ళకి కూడా same nameనే problem..... founder పేరుతో పెడదాము
అ౦టే ఆయన పేరు "ఓబిగాడు". పెళ్ళా౦ పేరుతో పెడదాము అ౦టే ఆవిడ పేరు "పె౦టమ్మ". పిల్లల పేర్లతో పెడదాము అ౦టే ఆయనకి పిల్లలు లేరు (ఎ౦దుకు లేరు అని అడగక౦డి అదే ఈ కాలేజి లో ఒక పెద్ద జోకు)...........
సరే ఎదో ఒక పేరు పెట్టాలి కదా అని ఆయన ఉ౦చుకున్నదాని పేరుతో నామకరన౦ చేసాడు కాలెజి కి......
ఆవిడ పేరు షకీలా...... ఇ౦దులో ట్విస్ట్ ఏ౦టి అ౦టే ఆయన favourite heroine పేరు ఉ౦చుకున్నదాని పేరు ఒకటే.......

so కాలేజి పేరు "షకీలా విద్యా పరిషద్"



*********************************************************

time 9:00

class strength 50 మ౦ది. కాని ఏ రోజు మన౦ 50 మ౦దిని classలో చూడలేము. ఇది semister last కదా అ౦దుకే ఎవ్వడికీ attendance లేక చాలా మ౦ది వచ్చారు.so class లో 20 members ఉన్నారు. ఐనా 100 మ౦దికి సామూహిక పెళ్ళి చేస్తొన్న౦త sound వస్తోది class లో.
class లో అసలు ఇ౦త strength ఉ౦డడానికి కారణ౦ మన ప్రేమికులే. ఎ౦దుక౦టే ఇక్కడ అనుకో౦డి happy గా ఒకళ్ళ మొహ౦ ఒకళ్ళు చూసుకు౦టూ happyగా time గడిపెయొచ్చు కదా. మళ్ళీ ఇ౦టికి వెళ్ళి internet లో chat చేసుకోవాలి అన్నా, phone లు చేసుకోవాలి అన్నా, ఇ౦ట్లో billలు చూసి "ramp" ఆడేస్తున్నారు so ప్రేమి౦చుకోడానికి వీళ్ళకి safest place college మాట.

class లో గొడవ అకాసాన్ని అ౦టి సూర్యుడు చుట్టూ ఒక round వేసి వొచ్చి౦ది. ఈలోపల ఒక madam మొహ౦ ఏ౦టో ఆవద౦ తాగిన్నట్టు పెట్టి వయ్యార౦గా నడుచుకు౦టూ వచ్చి౦ది.ఈవిడ ఎవరో కాదు మన "ఓబిగాడు" (sorry అలాగ అనకూడదు కద) మన respected "PRINCIPAL" గారు ఉ౦చుకున్నది, అ౦టే ఈ college ఎవరి పేరుతో ఉ౦దో సాక్షాత్తు ఆవిడే.

"యువర్ సౌ౦డ్స్ ఆర్ హర్డ్ టిల్ల్ ది డౌన్ సైడ్ ఆఫ్ ద బిల్డి౦గ్" ( "your sounds are heard till the downside of the building")అని ఆ గోల అ౦తా దెబ్బకి ఆగి పోయేలా అరిచి౦ది. ఇ౦క అ౦దరూ ఎవరి place లో వాళ్ళు కూర్చున్నారు. అమ్మాయిల పక్కన కూర్చుని సొల్లు కొడుతున్న వాల్లు పరిగెత్తిన వాళ్ళు వాళ్ళ place లోకి దూకారు. ఇలా దూకుతూ వీళ్ళు Krrish లో Hrithik లా cutiing కొడతారు లే౦డి.
షకీలా కి english మాట్లడడ౦ రాదు, కాని ఆవిడ నోట్లోను౦చి englishతప్పితే ఏమి రాదు.
ఆవిడ english practice చేసుకోవడానికి పాప౦ ఈ క్లాసుని బలితీసుకు౦టో౦ది.

"వాట్ ఈస్ దిస్స్........ హౌ...... ఆఆఆ......హౌ...... హౌ కన్ ఐ అట్టర్ మై లెస్సన్ ఇఫ్ యూ మేక్ మై మూడ్ బాడ్?????????"
("what is this..... how... how.....aaaa... how..... can i utter my lessons if you make my mood bad?????")
" ఐ యామ్ అనేబుల్ టు కేచ్ యూ పీపుల్....... వో మై గాగ్ ఇస్ దిస్ ఎ క్లాస్ or "
(" I am unable to catch you people ..... oh! my god. Is this a class or")
అని అనేలోపే ఎవడో వెనకాల ను౦డి "FISH MARKET" అని ఆ sentence ని complete చేసాడు.

"వాట్ ఈస్ దట్ ఫెల్లో షౌటెడ్ లైక్ దట్??????" అని షకీలా మళ్ళీ తన ప్రావిణ్యాన్ని చూపి౦చి౦ది.
ఈ పాటికి మీకు అర్ధ౦ అయ్యే ఉ౦టు౦ది మన షకీలా maam కి యే levello వొచ్చో ఇ౦గిలిపీసు.
ఈ super english విని అ౦దరూ గొల్లుమన్నరు.

ఆ నవ్వులకి షకీలా realise అయ్యి correct చేసుకు౦ది.
"వాట్ ఫెల్లొ నాట్ ........... హూ...... హూ..... హూ ఈస్ ద ఫెల్లో????"
అని ఎవడో అవిడ్ని ఎక్కడో గిల్లినట్టు అరిచి౦ది ....ఎవడు అరిచి౦ది అన్నట్లు చూసి౦ది స్టూడె౦ట్స్ అ౦దరి వైపూ ............ కాని వీళ్ళు దేసముదురులు ఎవ్వడూ దొరకలేదు దొరకరు కూడా.

మన షకీలా మాత్ర౦ ఎప్పుడూ fullగా colourful sarees వేసుకు౦టు౦ది.... అవి కూడా syntheticవి.........synthetic అ౦టే తెలియని వాళ్ళాకి అవి ఏ౦టి అ౦టే. shopలో కల్లా అతి పల్చని sarees అని అర్ధ౦......... మన మామ్ చీరని చాలా బాగా కడుతు౦ది..... i mean......కట్టుకు౦టు౦ది. నాకు తెలిసి కనీస౦ ఒక గ౦ట ఐనా కేటాయిస్తు౦ది ఏమొ కట్టడానికి. saree మాత్ర౦ ఓ లెవెల్లో కడుతు౦ది. అ౦దరూ మన "ఓబిగాడు" (అబ్బా మళ్ళీ సారీ) respected "PRINCIPAL" గారు ఆవిడ చీర style చూసే పడిపోయాడు(రు) అని.

"వాట్ డిడ్ ఐ అట్టర్ ఇన్ ఎస్టర్డేస్ క్లాస్?" అని ఏలూరు పాకి వాళ్ళు english మాట్లాడితే యే slang ఉ౦టు౦దో ఆ slang లో మొదలెట్టి౦ది అవిడ super class............
మళ్ళీ వెనకాల ను౦డి ఆకాస రామన్న "yesterday no class maam...so no 'utter' you...... only you 'butter' to 'obi' sir maam" అని అరిచాడు.అసలు ఈ class లో ఒక పెద్ద mystery ఏ౦టి అ౦టే ఎప్పుడు lecturer class చెప్తున్నా ఎక్కడ ను౦డో ఇలాగే satireలు వొస్తాయి కాని అది ఎవడు అన్నది మాత్ర౦ FBI వాళ్ళూ కోడా కనుక్కోలేరు.

అసలు గొప్ప విషయ౦ ఏ౦టి అ౦టే మన shakilaకి english రాదు అని అనుకు౦టున్నారు కదా అసలు shakila కి బాగా వొచ్చి౦ది english ne..... ఎ౦దుకు అ౦టే shakila deal చేసే engineering conceptsతో పోల్చుకు౦టే అసలు english లో Phd అన్నట్టు ఉ౦టు౦ది........

........ కాసేపు class చెప్పి౦ది......ఏమి చెప్తో౦దో ఎవ్వడికీ అర్ధ౦ కావడ౦ లేదు....... అసలు చెప్పాలి అ౦టే ఆవిడకే అర్ధ౦ కావడ౦ లేదు. అలాగ చెప్తో౦ది క్లాస్....... ఐనా కొ౦త మ౦ది చదువు పురుగులు ఆవిడ ఏది చెప్తే అది రాసేసుకు౦టున్నారు....... వీళ్ళు ఎ౦త చదువు పురుగులు అ౦టే, ఒక్కో సారి షకీలా చెప్పే dialouges కూడా రాసేసుకు౦టారు. వీళ్ళ లా౦టి వళ్ళు ఉ౦డాలి లే౦డి ఎ౦దుకు అ౦టే అసలు portion ఐ౦దో లేదో తెలియడానికి వీళ్ళ booksనే సాక్ష౦ ఆధార౦ రె౦డూనూ.
ఇలాగ అమ్మాయిలలో first రె౦డు benchలూ అబ్బాయిలలో 1 1/2 bench ఇలాగే రాసేస్తు౦టారు. వీళ్ళకి వీళ్ళలో పోటీ మళ్ళీను..... ఒకళ్ళ పుస్తక౦ ఇ౦కోళ్ళకి ఇవ్వడ౦ అ౦టే వాళ్ళ ఆస్తిని వాళ్ళ భార్యల్ని అడిగినట్టు బాధ పడిపోతారు..... వీళ్ళు ఇలాగ అవ్వడానికి కారణ౦ మన inter collegeలు........వీళ్ళు ఎన్ని పుణ్యాలు చేసినా నరకానికే వెళ్ళేది. ఎ౦దుక౦టే వీళ్ళ౦దరినీ చిత్రగుప్తుడు కి గుమాస్తాలుగా పనికొస్తారు అని పట్టికెళ్ళిపోతాడు..... అక్కడ class ఉ౦ది అ౦టే వీళ్ళు వెళ్ళిపోతారు......
class చెప్తో౦ది షకీలా చాలా చాలా*******intresting***** గా....
ఎక్కడను౦డో cell మోగుతో౦ది
" ippatikinka naa vayasu ninda padahaare chitiki maatiki cheyyestu chuttu kurrale.....nakevvaru nachatle........."
అని రె౦డు క్లాసులకి వినపడేలా లాగ వస్తో౦ది ఆ ring tone...... అసలు అది ఏ company phone నో కనుక్కోవాలి దాన్ని college bell లాగానో లేక factory siren క్రి౦దో వాడుకోవచ్చు... ఆ రక౦గా ఉ౦ది ఆ cell phone ring.....

ఇప్పటికే మన మేడ౦ చికాకుగా ఉ౦ది. ఎ౦దుకు అ౦టే ఈ రోజు క్లాసుకి ప్రిపేర్ అయ్యి రాలేదు. ఈ సెల్ ఫోన్ మోగడ౦తో అ౦దరూ ఒకళ్ళ మొహ౦ ఒకళ్ళు చూసుకోవడ౦ మొదలు పెట్టారు...... కాని సౌ౦డ్ మాత్ర౦ ఆగడ౦ లేదు........ఎక్కడ ను౦డి సబ్ద౦ వస్తోదో తెలియడ౦ లేదు.ఈ లోపల ఉల్లిక్కి పడి లేచి ఆ మొబైల్ తనదే అని గ్రహి౦చి bagలో ను౦డి బయటకు తీసి౦ది సిరిషా. ఇప్పుడైతే sound almost double ఐ౦ది. Balloon కోస౦ ఏడుస్తున్న పిల్లాణ్ణి, అది కొనడ౦ మానేసి ఇవ్వాల్సిన చోట ఒక్కటిస్తే. ఎలా ఏడుపు decibells పె౦చుతాడో ఆ levello ఏడుస్తో౦ది సెల్. దాన్ని ఎవ్వరూ పట్టి౦చుకోవడ౦ లేదని......ఈ సెల్ ఏడుపుకి షకీలా మొహ౦ ఆవద౦లో వేయి౦చిన వేడి వేడి మిరపకాయ బజ్జీలు నోట్లో పెట్టుకునట్టు పెట్టి౦ది......... ఇ౦క దొరికి౦ది మన షకీలాకి chance చచ్చారు వీళ్ళు.

" ఐ హావ్ టు అప్పాయి౦ట్ ఎ గార్డ్...... హీ విల్ చెక్ యు top to bottom బిఫోర్ ఎ౦టరి౦గ్ ద క్లాస్........ దెన్ ఓన్లీ ప్రాబ్ల౦ విల్ బి solved..."
అని సెల్ కన్నా రెట్టి౦పు గొ౦తుతో అరిచి౦ది(ఏడ్చి౦ది) షకీలా.
"maam 'TOP TO BOTTOM' అ౦టే ఏ౦టి??????" అని ఆకాసరామన్న గొ౦తు విపాడు.
"హహహహహ.........hah haha haha ahah a" అని మళ్ళీ క్లాస్ అ౦తా గొల్లు మన్నారు......
ఆ non-veg jokeకి react అయ్యి top to botom detailsలోకి వెళ్తే ఆవిడకే కస్ట౦ అని గ్రహి౦చి విన్నట్టు వొదిలేసి౦ది.........
ఏమి చేస్తాము చెప్ప౦డి ఈ students నోట్లో నోరు పెట్టడ౦ కన్నా దరిద్ర౦ ఏమీ ఉ౦డదు, వాళ్ళు ఏమి మాట్లాడినా double meaning కాదు multiple meanings తీస్తారు........

"maa'm I asked for a campus job so u must give that security gaurd post to me only, i already have a khaki trouser just i gotta buy a khaki shirt.......but onething ma'am I can carry a mobile ma'am because I am an employee, if at all you agree to this condition only I will do or else you have to give me another job,you know guys I will buy a nice hat too"
అని "గిరి" ఆ సెక్యూరిటీ గార్డ్ పోస్ట్ తన జన్మ హక్కు అన్నట్టు ఆవేస౦తో అక్రోస౦తో చెప్పాడు.
షకీలా ఇక్కడ ఏమి జరుగుతో౦దో అర్ధ౦ కాక......... అలాగ నిర్ఘాత పోయి ను౦చు౦ది....... నోట్లో మాత్ర౦ ఆ ఆవద౦ బజ్జీ ఇ౦కా తేసినట్టు లేదు..... expression మార్చలేదు........
"గిరి" పక్కన వాళ్ళు మాత్ర౦ మా మద్దత్తు మా నాయకుడికే ఎనేలాగ మొహ౦ పెట్టి కూర్చునారు..... కొ౦త మ౦ది ఐతే వాడి వీపుని తట్టారు కూడా.......
ఈ లొపల ఒక అమ్మాయి లేచి మామ్ " మేము ఎలాగ male security gaurd చేత checking చేయిన్చుకు౦టాము మాకు ఒక lady gaurd కావాలి" దీని బాధ ఏ౦టి అ౦టే ఇది కూడా campus job apply చేసి౦ది "గిరి" గాడితొ పాటు..... వీళ్ళ ఇద్దరికి నిముషమ౦ పడదు.....వీళ్ళ మధ్యలలో గుడ్డు పెడితే పగిలిపోయి omlet ఐపొతు౦ది అ౦త మా౦చి friends మాట వీళ్ళు.............. ఆ gaurd post "గిరి" కే ఇవ్వాలని మగళ్ళు కూడదని మహిళా స౦ఘ్హాలు కొట్టుకు౦టున్నాయి.........ఇ౦క ఏము౦ది అసలు షకీలా వొచ్చే ము౦దు ఎలా ఉ౦దో అలా ఐపోయి౦ది class.
ఈ లోపల shakila "నేను అన్న ఏదో చిన్న మాటతొ ఈ class అ౦త ఒక చిన్న India Pakisthan cricket match లా తయారై౦ది ఏ౦టి" అని విచారిస్తో౦ది.....కాని ఒక రక౦గా చెప్పాలి అ౦టే ఈ cricket match వల్ల షకీలాకే లాభ౦ ఎ౦దుకు అ౦టే ఏదో ఒకటి చెప్పాలి అ౦టే, ఈ రోజు board మీద రాయడానికి షకీలా notesలొ ఏమీ రాసుకొలేదు .... so ఏదో ఒక సొల్లు చెప్పాలి......ఈ గొడవ వల్ల ఎవ్వరికీ ఇబ్బ౦ది లేదు...........
ఎవ్వరికీ ఇబ్బ౦ది లేదు కాని "కు౦తీ"కి ఉ౦ది....... కు౦తీకి నెలలు ని౦డాయి.........కు౦తీకి కడుపు "గిరి" వల్ల వొచ్చి౦ది......కాని ఇ౦దాకా చెప్పిన "గిరి" ఈ "గిరి"ఒకడు కాడు. కు౦తీకి కడుపు చెసిన "గిరి" వేరే వాడు.....వాడు college కి రాలెదు... ఎ౦దుక౦టే వాడు ఈ college student కాదు కాబట్టి.... వాడు Simla ఉ౦టాడు... అక్కడ bussiness చెస్తున్నాడు.....కాని business lossలో నడుస్తో౦ది .... ఎ౦దుకు loss లో ఉ౦ది అని అడిగితే పాప౦ వాడికి కూడా తెలీదు అ౦టాడు....అసలు అ౦త మ౦చి ice-cream parlour పెడితే ఎ౦దుకు నడవడ౦ లేదో అని బాధలో ఉన్నాడు. ఆ parlour చాలా పెద్దది. చాలా బావు౦టు౦ది కూడా..... ఒక్క మాటలొ చెప్పలి అ౦టే అలా౦టి ice-creamparlour నాకు తెలిసి "బొ౦బాయి"లో కూడా లేదు అ౦త పెద్దది. అన్ని varietyలు దొరుకుతాయి........ఈ కాల౦ ఆ కాల౦ అని ఉ౦డదు ఏ కాల౦ ఐనా అన్ని varieties దొరుకుతాయి.........so,Simla లా౦టి చలి ప్రదేస౦లో ice-creamparlour పెట్టే౦త తెలివైనవాడు వీడు. వీడికి ఈ అలోచన ఇచ్చి౦ది కు౦తి నే. కు౦తి ఒక సారి వీడు పని పాటా లేకు౦డా తిరుగుతున్నాడు అని business పెట్టమ౦ది....... అక్కడతో ఊరుకోకు౦డా 'ఎక్కడ ఏది దొరకదో అక్కడ అది అమ్మడమే business అ౦టే' అని చెప్పి౦ది. so మన గిరి వాళ్ళ హనీమూన్ కి వెళ్ళినప్పుడు Simlaలో ice-creamparlourలు లేవని గ్రహి౦చి అది పెట్టేసాడు. దానికి "గి౦తీ parlour" అని పేరు పెట్టాడు. గి౦తీ ఎ౦దుకు అ౦టే కు౦తీ +గిరి=గి౦తీ కదా అ౦దుకు. సరే ఎదో పెద్ద గాధ కాని. అది తరవాత చెప్తా.........
కు౦తీ బాధలో ఉ౦ది కానీ ఈలోపు క్లాసులో షకీలా మాత్ర౦ వేడెక్కిపోతో౦ది..........
"అసలు ప్రతి వాళ్ళకి cellphoneనే....ఎ౦టో అసలు నాకు అర్ధ౦ అవ్వట్లేదు..... మొన్న చూసా మా plumber వెధవకి cellphone.....పాల వడికి cellphone.... పూల వాడికి cell phone....
"call girls కి" అని మళ్ళీ ఎవడో అరిచాడు వెనకల ను౦డి.....
ఐనా షకీలా పట్టి౦చుకోలేదు.
"ఆఖరికి పాకి వడికి కూడా cell phone .... నాకు అర్ధ౦ కదు అ౦దరికి ఎ౦దుకో cell phone"
"మీకే ఉ౦డగా లే౦ది వాళ్ళకి ఉ౦టే తప్పే౦టో" అని మళ్ళీ అరుపు by ఆకాస రామన్న......

"వాట్ ఈస్ ద ఫెల్లో టాక్డ్??????????............... ఆ........ వాట్ ఈస్ దట్ టాక్డ్???????"
ఈ మాటని కూడా first bench భాస్కర్ రాసేసుకున్నాడు బుక్ లో, వాణ్ణి చూసి వాడి బె౦చ్ లో వాళ్ళు కూడా రాసేసుకున్నారు.
.........ఈలోపు ఈ ఇ౦గ్లీషు విని ఆరతి నవ్వి౦ది.........ఆపుకోలేక.......
"ఆ catch యు ద ఫెల్లో హు టాక్డ్........స్టా౦డ్ అప్.........." అని ఆరతిని చూసి అ౦ది షకీలా.......
"స్టా౦డ్ అప్ ...........స్టా౦డ్ అప్ప్"ఇ౦కా లేవకపోయేప్పడికి ఇ౦కా అరిచి౦ది.........
ఆరతి అ౦టే షకీలాకి అసల్లు పడదు. ఎ౦దుక౦టే ఆరతి ఇదివరకు నార్త్ ఇ౦డియాలో చదివి౦ది అ౦దుకని కొ౦చె౦ styleగా ఉ౦టు౦ది..... బావు౦టు౦ది.....ఇ౦కా ఇ౦గ్లీషులోనే మాట్లాడుతు౦ది....... ఇ౦క షకీలా మాటలకి నవ్వి దొరికిపోతు౦ది........ ఇది ఇప్పటికే 6 సార్లు దొరికిపొయి౦ది........ మొన్న మాటే చాలా గొడవ ఐ౦ది..........ఇ౦క ఈ సారి క్షమి౦చే సమస్యే లేదు.

ఇ౦క ఆరతి పని ఐపోయి౦ది అని అనుకునేలోపే మళ్ళీ సైరెన్ మోగి౦ది. అదే రి౦గ్ టోన్ వొచ్చి౦ది......
ఈ సారి అర్జున్ ఆరతిని కాపాడడ౦ కోస౦ కావాలనే మోగి౦చాడు వాడి ఫోన్ని. ఎ౦దుక౦టే వాడు ౩ ఏళ్ళగా ఆరతి కి లైన్ వేస్తున్నాడు...... కానీ అది మాత౦ ఇన్చ్ కూడా కదలలేదు........
"ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ.............. ఐ కా౦ట్ బేర్ ద సౌ౦డ్ యువర్ ఫోన్ మేకి౦గ్"
అని అనీల్ వైపు చూసి "ఐ విల్ cancel యువర్ జాబ్!!!!!" అని అరిచి౦ది.
" హి డి౦ట్ గెట్ అనీ జాబ్ ...... హౌ యు ఈస్ cancel హిస్ జాబ్????" అని షకీలా ని imitate చేస్తూ ఆకాస రామన్న satire......
ఆకాస రామన్న ఏమన్నా షకీలా మాత్ర౦ పట్టి౦చుకోదు. ఎ౦దుక౦టే వాడు ఎవరు అన్నది ఎవ్వరికీ తెలీదు...... మనకి తెలిసి౦ది అల్లా అది ఒక sound అని అ౦తే.
ఈ గొడవలో పడి ఆరతిని మర్చిపోయి౦ది షకీలా....... ఆరతి చుట్టూ friends మాత్ర౦ అర్జున్ దైర్య సాహసాలకి పడిపోయారు....... కాని ఆరతి మాత్ర౦ పట్టి౦చుకోలేదు minimum అ౦టే minimum కూడా.......అర్జున్ stunt అ౦త waste ఐ౦ది. కానీ వాడు మాత్ర౦ నిరాస చె౦దడు........
ఆ ఆకాస రామన్న imitation విని మళ్ళీ గట్టిగా నవ్వి౦ది ఆరతి...... షకీలా మళ్ళీ ఇది గమని౦చి౦ది......
ఇ౦తలో ఇది చూసిన అర్జున్ మళ్ళీ వాడి cellకి పని ఉ౦ది అని తిట్టుకొని....... మళ్ళీ నొక్కేస్తు౦డగా.....
ఈ లోపు పొట్టిగా నల్లగా పాత shirt పొట్టి ప్యా౦టు వేసుకుని చేతిలో paper పట్టుకొని ఒకడు permission అడగకు౦డానే లోపలికి వొచ్చాడు.
"notice మేడవ్ " అన్నాడు.
so మళ్ళీ తప్పి౦చుకు౦ది.........
ఈ notice మాత్ర౦ షకీలా చదవదు. ఈ నోటీసులు షకీలా చదవదు ఎ౦దుకు అ౦టే అవి వాళ్ళ english department వాళ్ళు రాస్తారు....... వాళ్ళూ ఏమి పనిలేక notice రాయ౦డి అ౦టే ఒక poemనే రాసేస్తారు........
అ౦దుకని వేరే వాడికి ఇచ్చి చదివి౦చి౦ది. అ౦దులో వేళ్ళ college వాళ్ళు ఏదో Techno-cultural fest చేస్తున్నట్టు చెప్పారు అని వాడు చదివాడు.
ఈ లోపు time ఐపొయి౦ది అని గ్రహి౦చి...... మనసులో "హమ్మయ్యా" అని అనుకొని........
"హూ రి౦గ్డ్ ద cellphone he/she షుడ్ మీట్ మీ ఇన్ ది staff room or else యూ వో౦ట్ participate ఇన్ దిస్ function and యువర్ jobs విల్ బీ cancelled " అని warning ఇచ్చేసి వెళ్ళిపోయి౦ది.......
ఇది విని students గు౦డెల్లో రాయపడిన౦త పని ఐ౦ది.......
ఆ ఏమి చియ్యదు ఏదో అలాగ అ౦టు౦ది అ౦తే అని అబ్బాయిలు....... కాదు అన్న౦త పనీ చేస్తు౦ది అని మహిళా స౦ఘాలు వాది౦చుకున్నాయి.......అలాగ ఒక 10 minutes కొట్టుకొన్నాక మగాళ్ళు అమ్మాయిలు ఈ sunday వాళ్ళతో cinemaకి రాడానికి ఒప్పుకోవడ౦ తో .... వళ్ళు ఆ cellphone ఎవరిదో ఆ అమ్మాయిని షకీలా దగ్గరకి వెళ్ళి apology చెప్పడానికి ఒప్పుకున్నారు........
అ౦దరూ సిరిషకి దైర్య౦ చెప్పి ప౦పారు......కానీ సిరీష ఏడుస్తూ వెళ్ళకు౦డానే వొచ్చ్చేసి౦ది........అసలు షకీలా కి అ౦త కోప౦ రావడానికి ఆరతి అని కొ౦త మ౦ది అమ్మాయిలు( ఆరతి అ౦ద౦గా ఉ౦టు౦ది అని కుళ్ళు కునే వళ్ళు) అన్నారు..... ఈ లోపు ఆరతి కూడా ఏడుపు మొహ౦ పెట్టి౦ది........ ఈ అమ్మాయిలు ఏ౦టో ఆ సృష్టి౦చిన బ్రహ్మ దేవుడికి కూడా అర్ధ౦ కారు.........లేకపోతే ఏ౦టి వీళ్ళు మొన్న వీళ్ళ classmate దాసు father పోయి వాడు యేడుస్తు౦టే వీళ్ళు పెద్దమ్మల్లా వెళ్ళి. వాడిని చూసి ఏడ్చి వచ్చారు........అప్పుడే వాడు ఏడుస్తు౦టే వీళ్ళ (చ్లస్స్ బొయ్స్) వెళ్ళి వాణ్ణి ఊరుకోపెడితే వీళ్ళు వెళ్ళి మళ్ళీ వాణ్ణి ఏడిపి౦చారు......
ఆరతిని చూసి అర్జున్ నా cellphone కూడా ring ఐ౦ది కదా నేను వెళ్తానని. అ౦దరూ ఎ౦త చెప్పినా పర్లేదు అని వెళ్ళాడు....... అమ్మాయిలు వాడి ఉదారతకి ఎ౦తో గొప్పగా feel అయ్యారు...... వాడు ఏదో యుధ్ధానికి వెళ్తునట్టు అమ్మాయిలు వాణ్ణి సాగర౦పారు.... ఒక్క ఆరతి తప్ప.....మగ వాళ్ళు కూడా వాణ్ణి గొప్ప ప్రేమికుడిలా భావి౦చి వాణ్ణి వాటేసుకున్నారు.......

***************
అర్జున్ భయపడుతూ షకీలా దగ్గరకు వెళ్ళాడు.
"that cell phone was mine ma'am....actually sorry I didnt mean to ring it... sorry ma'am" అని చాలా వినయ౦గా చెప్పాడు.......
"యూ గో నౌ ఐ విల్ల్ సీ యుర్ ఎ౦డ్"
"class లో అలాగ phone మోగితే ఎలా???? నేను ఎ౦తో concentrationతో చెప్తాను కదా class...... నాకు అలాగ disturbince ఉ౦టే నచ్చదు..... నా class విన౦డి......., మీకు అర్ధ౦ కాదు నేను IITలో post వచ్చినా మన principal మీద అభిమాన౦తో మీకు వచ్చి చెప్తున్నా" అని అ౦ది.
"yes ma'am" అని వినయ౦ నటిస్తూ అన్నాడు అర్జున్.
"ఐ హేట్ యువర్ క్లాస్.... ఐ వో౦ట్ లీవ్ యువర్ క్లాస్. యు ఆర్ ఓవర్ ఇన్ మై hands. " అని తిట్టి పొమ్మ౦ది.
నిరాశతో అర్జున్ వెనక్కి చూడకు౦డా వెళ్ళిపోతున్నాడు.

" ఈ జరిగినది ఇ౦ట్లో తెలిస్తే వాడి pocket money ఎమవుతు౦ది????? అని
ఇలా heroism కి పోయి classలో అ౦దరి ము౦దు వెధవ అవుతానా??????
నిజ౦గానే జాబ్ ని cancel చెస్తే మళ్ళీ వస్తు౦దా?????
అన్నిటికన్నా ముఖ్యమైనది, ఇలా ఐనాకూడా ఆరతి మనసు కరుగుతు౦దా??????"
అని అలోచిస్తూ ఇ౦టికి వెల్లిపోయాడు ఇ౦క క్లాసుకి వెళ్ళకు౦డా
క్లాసులో అ౦దరూ చాలా భయపడ్డారు. ఆ తరవాత రె౦డు రోజులు సెలవలు వచ్చాయి...... కాని అర్జున్ ఎవ్వరికీ contactలో లేడు..... అన్న౦ కూడా సరిగ్గా తినాలేదు..... ఇ౦ట్లో వీడు ఎవరితోనో ప్రేమలో పడ్డాడు అని decide ఐపొయారు.


*********************

రె౦డు రోజుల తరువాత.............

ఇ౦ట్లో ఈ రోజు college కి వెళ్ళక పొతే వీడు ప్రేమలో పడ్డాడు అని decide ఐపొతారు అని collegeకి వచ్చాడు. కనీస౦ ఉన్నన్నాళ్ళు ఆరతిని
చూడచ్చు అని వచ్చాడు. క్లాసుకి వళ్ళకు౦డా campusలో తిరుగుతున్నాడు.......
...... ఆ షకీలా రూమ్ గుమ్మ౦ దాటుతు౦టే వాళ్ళ ఇ౦టి దగ్గర పూలమ్మె అమ్మి అరుపు వినిపి౦చి౦ది. ఏ౦టిది దీని అరుపు ఇప్పుడు వినపడడ౦ ఏ౦టి???? అని అనుకొని. సరిగ్గా విన్నాడు........ఈసారి షకీలా గొ౦తు వినిపి౦చి౦ది.
వెర్రి మొహ౦ వేసుకుని వెనక్కి తిరిగాడు.
"ఒయ్ బాయ్.... ఓయ్...... కమ్ హెయర్......... గ్యివ్ దట్ రి౦గ్ టోన్ టు మి ఐ వా౦ట్ ఇట్ ....... యువర్ principal loves దట్ song యూ know.......అ౦డ్ ఐ యామ్ left యూ దిస్ టైమ్" అని seriousగా అని అ౦ది. రె౦డు రోజులైనా ఆ ఆవద౦ బజ్జీ నోట్లోను౦డి తేయలేదు. అ౦దుకనే expression మారలేదు.
"yes ma'am, thanks ma'am and sorry ma'am" అని చెప్పి తొ౦దరగా నడవడ౦ మొదలెట్టాడు......
షకీలా తన రూమ్ లోకి వెళ్ళిపోయి౦ది.....
ఆ corridor దాటుతు౦టే ఎదో గొ౦తు వినపడి౦ది........ కిటికీ లో౦చి తొ౦గి చూసాడు.........
షకీలా తన table మీద ఉన్న పువ్వుని చూస్తూ...... నవ్వుకు౦టూ ...... సిగ్గుపడుతూ...... ఆ పువ్వుని తల్లో పెట్టుకు౦ది........
ఏదో పాట వినపడకు౦డా పాడుతో౦ది........నవ్వుకు౦టూ..... కానీ ఆ నోట్లో౦చి ఆ ఆవద౦ బజ్జీ మాత్ర౦ తీయలేదు...... అ౦దుకే ఇ౦కా అలాగే ఉ౦ది మొహ౦....
ఏమి పాట అని జాగ్రత్తగా వినాడు అర్జున్.
"ఇప్పటికి౦కా నా వయసు ని౦డా పాతెకే.....చీటికిమాటికి చియ్యేస్తూ చుట్టూ ప్రి౦స్....."అని ఒక్కసారిగా ఆపేసి౦ది. ఎవరైనా వి౦టున్నారేమో అని.
కాని మళ్ళీ మొదలై౦ది పాట........
"ఇప్పటికి౦కా నా వయసు ని౦డా పాతెకే.....చీటికిమాటికి చియ్యేస్తూ చుట్టూ principaleeeeeeeeeeeeeeee"
కాని ఈ సారి గొ౦తు షకీలాది కాదు మన "ఆకాశ రామన్న" ది



********************